వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్న పట్టభద్రురాలు కాకపోయినా.. మండలి ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఎన్నికల కమిషన్ ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. అధికార తెరాస అక్రమాలకు పాల్పడుతున్నట్లు తాము ముందు నుంచీ చెబుతున్నా.. ఈసీ, అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
'తాండూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ను పదవి నుంచి తొలగించాలి' - aicc spokes person fires on swapna news
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ను పదవి నుంచి తొలగించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇతరుల ఓటును తన ఓటుగా వేసినందుకు ఈసీ ఆమెపై చర్యలు తీసుకోవాలన్నారు.
'తాండూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ను పదవి నుంచి తొలగించాలి'
ఈ సందర్భంగా ఇతరుల ఓటును స్వప్న ఎలా వేశారని శ్రవణ్ ప్రశ్నించారు. దొంగ ఓటు వేసిన ఛైర్పర్సన్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎమ్మెల్సీ ఓటుపై గందరగోళం