సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంధనూర్ బషీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కొడంగల్ పట్టణంలోని వినాయక కూడలి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
'చాడ వెంకట్ రెడ్డిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి' - కొడంగల్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ వార్తలు
కొడంగల్ పట్టణంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంధనూర్ బషీర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. చాడ వెంకట్ రెడ్డిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
'చాడ వెంకట్ రెడ్డిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి'
రాష్ట్రంలో సామాన్యులతో పాటు రాజకీయ నాయకులకూ భద్రత లేకుండా పోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చాడ వెంకట్ రెడ్డిపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.