వికారాబాద్‌లో కల్తీ కల్లు ఘటనపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కొత్తగడి, చిట్టిగిద్దలోని కల్లు డిపోల్లో నమూనాలు సేకరించారు. అనంతరం రెండు దుకాణాలను సీజ్ చేశారు. కల్తీ కల్లు తాగి ఇప్పటివరకు 354 మంది అస్వస్థతకు గురవ్వగా... ఇద్దరు మృతిచెందారు.
354 మందిని ఆస్పత్రిపాలు చేసిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం - వికారాబాద్ జిల్లా వార్తలు
వికారాబాద్ కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు 354 మంది అస్వస్థతకు గురవ్వగా... ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

కల్తీ కల్లు ఘటనపై దర్యాప్తు వేగవంతం
ఇందులో ప్రస్తుతం 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా బాధితులు డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందినప్పటికీ... వారి మానసిక స్థితి సరిగా లేదని బంధువులు తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన కల్లు నమూనాల రిపోర్టు రాలేదని మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:చైనా వస్తువులే కాదు టీకా కూడా నాసిరకమే!