A minor girl was raped in Vikarabad: ప్రభుత్వ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. పోలీస్ పెట్రోలింగ్ జరుగుతున్నా.. ప్రజల్లో ఇలాంటి ఘటనపై అవగాహన కల్పిస్తున్నా.. కీచకుల తీరు మారడం లేదు. హైదరాాబాద్లో రెండురోజుల క్రితం ఇళ్లలో పనిచేసుకునే మహిళపై ఇద్దరు వ్యక్తుల సామూహిక అత్యాచార ఘటన ముగియక ముందే.. రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. ఈసారి అత్యాచారం జరిగింది మైనర్ బాలికపై. తెలిసిన వాడే ఈ దుశ్చర్యకు పాల్పడటం ఇందులో మరో ఘోరం.
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ఓ గ్రామంకు చెందిన బాలిక అదే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. పాఠశాల నుంచి ఉపాధ్యాయులు విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లారు. సాయంత్రం ఇళ్లకు చేర్చే క్రమంలో వాహనాలేవి అందుబాటులో లేకపోవడంతో రాత్రివేళ పేర్కంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు కారులో వచ్చాడు.
ఉపాధ్యాయులకు ఆ యువకుడు పరిచయం ఉండడంతో బాలికను ఇంటి వద్ద దించమని కోరారు. అందుకు అంగీకరించిన యువకుడు బాలికను కారులో తీసుకొని తెల్లవారుజామున దాకా కారులోనే తిప్పుతూ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. బాలిక ప్రవర్తనలో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన విషయం బాలిక తల్లిదండ్రులకు వివరించింది.
దీంతో తల్లిదండ్రులు యాలాల పోలీసుస్టేషన్లో ఆ యువకుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించారు. విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్లి క్షేమంగా ఇళ్లకు చేర్చే క్రమంలో నిర్లక్ష్యం వహించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెస్షన్ వేటు వేశారు. విధుల నుంచి తొలగించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: