వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్లోని పెద్దచెరువులో తూము తీసేందుకు ఇద్దరు వెళ్లారు. తలారి గోపాల్(39) ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడు. విషయాన్ని మరో వ్యక్తి గ్రామస్థులకు తెలియజేశాడు. వారు గాలించగా ఫలితం లేదు. పోలీసులకు సమాచారం అందించారు.
తూము తీయడానికి వెళ్లి.. చెరువులో పడి వ్యక్తి మృతి - వికారాబాద్ జిల్లా తాజా వార్త
చెరువులో తూము తీసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. ఈ ఘటన మంబాపూర్లో చోటుచేసుకుంది.

చెరువులో తూము తీయడానికి వెళ్లి ఓ వ్యక్తి మృతి
పెద్దేముల్ ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలికి చేరుకున్నారు. జాలరుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'