వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని పలు గ్రామాలలో 30 రోజుల కార్య ప్రణాళికపై జిల్లా పాలనాధికారి ఆయేషా నష్రత్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల అభివృద్ధిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉండే మహిళలకు తడి చెత్త, పొడి చెత్తపై అధికారులు మరింత అవగాహనా కల్పించాలని సూచించారు. కులకచెర్ల బాలికల పాఠశాలలోని ఖాళీ స్థలంలో కూరగాయలను పెంచాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు.
'30రోజుల ప్రణాళిక నిరంతరాయంగా సాగాలి' - '30రోజుల ప్రణాళిక నిరంతరం సాగాలి'
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని పలు గ్రామాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల అభివృద్ధిపై ఆరా తీశారు.
'30రోజుల ప్రణాళిక నిరంతరం సాగాలి'