తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్తీ కల్లుతాగి వృద్ధురాలు మృతి... 17 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగిన ఓ వృద్ధురాలు మృతి చెందింది. 17 మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లా నవాబు పేట మండలం చించల్​పేటలో జరిగింది.

By

Published : Mar 31, 2020, 4:40 PM IST

17 people sick due to contaminated palm wine
కల్తీ కల్లుతాగి వృద్ధురాలు మృతి... 17 మందికి అస్వస్థత

వికారాబాద్​ జిల్లా నవాబు పేట మండలం చించల్​పేటలో దారుణం జరిగింది. కల్తీ కల్లుతాగి వృద్ధురాలు మృతి చెందగా... 17 మంది ఆస్పత్రిపాలయ్యారు. బాధితులంతా ఆదివారం రాత్రి ఓ దుకాణం నుంచి కల్లు తెప్పించుకుని తాగారు. సోమవారం అందరూ అస్వస్థతపాలవ్వడం వల్ల వైద్య సిబ్బంది వెళ్లి మందులు ఇచ్చారు.

కల్తీ కల్లుతాగి వృద్ధురాలు మృతి... 17 మందికి అస్వస్థత

సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కల్లు తాగినవారందికీ వాంతులు, విరేచనాలు అవ్వడం వల్ల గ్రామ సర్పంచ్​ హుటాహుటిన బాధితులందరినీ వికారాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 14 మంది చికిత్స పొందుతుండగా మిగిలిన వారిని డిశ్చార్జ్ చేశారు.

ఇవీ చూడండి:క్వారంటైన్​కు కొత్త రూల్- గంటకో సెల్ఫీ తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details