జొమాటో, స్విగ్గీతో పాటు.. చాలా వరకు రెస్టారెంట్లు, హోటళ్లు వారి సొంత డెలివరీ సిబ్బందిని పోలీసులు అడ్డుకుంటున్నారని... వారికి అనుమతివ్వాలని రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఫుడ్ డెలివరి బాయ్స్‌ను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అడ్డుకుంటున్నారని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి.
ఫుడ్ డెలివరి బాయ్స్‌ను అనుమతించాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి - తెలంగాణ తాజా వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ బాయ్స్ ను పూర్తి స్థాయిలో అనుమతించాలని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. లాక్డౌన్ మినహాయింపుల్లో భాగంగా ఈ-కామర్స్ వ్యాపారానికి ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌కు అనుమతివ్వాలని మంత్రి కేటీఆర్‌కు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఫుడ్ డెలివరీ బాయ్స్
ఆన్లైన్ డెలివరీలు చేసేందుకు హోటళ్లు ఇన్‌హౌస్ నడవాల్సి ఉంటుందని.. వాటిని మూసేయాల్సిందిగా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. లాక్డౌన్ కారణంగా చితికిపోతున్న డెలివరీ, ఈకామర్స్ కార్యకలాపాలకు అనుమతించాలని కోరారు.
ఇదీ చూడండి:ఆగని ఆఖరి దోపిడీ కథనంపై హెచ్ఛార్సీ స్పందన