గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇనమెట్ల గ్రామంలో వైకాపా కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఆయనపై వైకాపా వర్గీయులు దాడి చేసి.. చొక్కా చింపేశారు. దాడి ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కుని చితకబాదారు. ఈ ఘటనతో.. సత్తెనపల్లిలో భయానక వాతావరణం నెలకొంది.
ఏపీ స్పీకర్‌పై వైకాపా దౌర్జన్యం.. స్పృహ తప్పిన కోడెల - attack
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇనమెట్ల గ్రామంలో వైకాపా నేతలు బీభత్సం సృష్టించారు. ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి చేశారు. ఆయన చొక్కా చించేశారు.
కోడెల శివప్రసాద్