సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. జాతీయ రహదారి సమీపంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు కృత్రిమ గర్భాధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్య్సకారులకు వందశాతం రాయితీతో ప్రభుత్వం అందిస్తోన్న చేపపిల్లలను కోదాడ చెరువులో విడిచిపెట్టారు.
సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం : తలసాని - కోదాడలో మంత్రి తలసాని పర్యటన
సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. కోదాడ చెరువులో 4.44 లక్షల చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ.. దేశానికే ఆదర్శమని తలసాని స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం: తలసాని
కోదాడ చెరువులో 4.44 లక్షల నాణ్యమైన చేపపిల్లల్ని విడుదల చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. కులవృత్తులను గౌరవించి, వారికి పలు రాయితీలు అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా మత్య్సశాఖ అధికారిణి సౌజన్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం: తలసాని
ఇవీచూడండి :'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'
Last Updated : Aug 7, 2020, 4:04 PM IST