సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరుగుతోన్న పలు అభివృద్ధి పనులను... ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పని తీరును పర్యవేక్షించవల్సిందిగా సూచించారు.
పాలనాధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించాలి: హరీశ్‌రావు - మంత్రి హరీశ్ రావు పర్యటన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
![పాలనాధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించాలి: హరీశ్‌రావు Minister Harish Rao visited Sangareddy District Zaheerabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10794737-753-10794737-1614374557389.jpg)
'కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించాలి'
పట్టణంలో డ్రైన్ నిర్మాణం వల్ల ఉపాది కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో నూతన వైకుంఠధామాలు నిర్మించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.