ఓ వైపు రాష్ట్ర ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వారి సమస్యలు తీరుస్తూనే.. మరో వైపు తన కుటుంబ సభ్యులతోనూ సరదాగా గడుపుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆట విడుపులో భాగంగా టేబుల్ టెన్నిస్ ఆడారు.
మనవరాలితో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి టేబుల్ టెన్నిస్ గేమ్ ఆడారు
లాక్డౌన్ నేపథ్యంలో ఓ వైపు ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూనే.. మరో వైపు సమయం దొరికినప్పుడల్లా తమ కుటుంబ సభ్యులతోనూ సరదాగా గడుపుతున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆటవిడుపులో భాగంగా మనవరాలితో కలిసి ఆయన టేబుల్ టెన్నిస్ ఆడారు.
మనవరాలితో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్లోని తన నివాసంలో మనవరాలు తన్వితో కలిసి ఆయన టేబుల్ టెన్నిస్ ఆడారు. లాక్డౌన్ నేపథ్యంలో తాను సమయం చిక్కినప్పుడల్లా కుటుంబసభ్యులతో గడుపుతున్నానని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటిస్తూ ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Last Updated : Apr 25, 2020, 6:06 PM IST