ఖమ్మం జిల్లాలోని మధుకాన్ షుగర్, పవర్ ఇండస్ట్రీస్ సంస్థ కరోనాను ఎదుర్కోవడంలో తమ వంతు సాయం చేసింది. కోటిన్నర వ్యయంతో ఇథనాల్‌తో సాయంతో డబ్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం శానిటైజర్స్‌ను, మాస్కులను తయారు చేయించింది. కరోనా సహాయక చర్యల్లో భాగంగా వీటిని కేటీఆర్‌కు అందించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో ద్వారా వీటిని జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో సైతం పంపిణీ చేసింది.
కొనసాగించండి..
రాష్ట్రం నుంచి కరోనాను తరిమేందుకు కేసీఆర్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. పేద ప్రజలకు, వలస కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించి, వైరస్ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
మధుకాన్ స్థాపకుడు, పార్లమెంట్ సభ్యుడైన నామా నాగేశ్వరరావు పేదలకు నిత్యావసరాలు అందిస్తున్నారని... నామా ముత్తయ్య ట్రస్ట్ కింద సామాజిక సేవలు చేస్తున్నారని తెలిపారు.
ఇవీ చూడండి:అంతర్జాతీయ ప్రమాణాలతో మొబైల్ వైరాలజీ ల్యాబ్