తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్తు వదలరా... మద్యం తాగి ఓటు వేయకురా!

తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రముఖ హాస్యనటుడు ఎల్బీశ్రీరాం..... తనపై తానే కేసు వేసుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు, మద్యం మత్తులో ఓటు వేసే వేలాది మందిపైనా న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేశారు. ఇంతకీ ఎందుకలా చేశారు?

మత్తు వదలరా

By

Published : Mar 30, 2019, 5:49 AM IST

Updated : Mar 30, 2019, 11:04 AM IST

మత్తు వదలరా
గత ఎన్నికల్లో మద్యం మత్తులో ఓటు వేస్తున్నారని ప్రశ్నిస్తే సాక్ష్యాలేవని అడిగారట కొందరు ప్రబుద్ధులు. దీనికి సమాధానంగా తనదైన శైలిలో మత్తువదలరా..! అంటూ ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు ప్రముఖ నటుడు, దర్శకుడు ఎల్పీ శ్రీరామ్.

నోటుకు ఓటు అమ్ముకోకండి!

"మద్యం సేవించి పనిచేస్తే ఉద్యోగినిసస్పెండ్ చేస్తున్నారు, మందు తాగి ఆపరేషన్ చేస్తే వైద్యుడి సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు, మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా విధించి జైలుకు పంపుతున్నారంటోన్న ఎల్బీ శ్రీరాం... మద్యానికి ఓటును తాకట్టుపెడితే కన్నఊరికి, ఉన్న దేశానికే కాదు... రేపటి తరం బంగారు భవిష్యత్​కు ప్రమాదం" అంటూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. మద్యానికి, కరెన్సీ నోటుకు.. విలువైన ఓటును అమ్ముకోవద్దని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:హరీశ్​రావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Last Updated : Mar 30, 2019, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details