తెలంగాణ

telangana

Srinivas Goud: ఈదులు గీసిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Jun 10, 2021, 9:35 PM IST

Updated : Jun 10, 2021, 10:53 PM IST

తాటి, ఈత చెట్లలో మంచి ఔషధ గుణం ఉందని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెంపేట గ్రామ శివారులో ఉన్న ఈత వనాన్ని ఆయన సందర్శించారు.

excises
మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెంపేట గ్రామ శివారులో ఉన్న ఈత వనాన్ని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సందర్శించారు. ఈత చెట్టుని గీస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. గీత కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

తాటి, ఈత చెట్లలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని మంత్రి అన్నారు. కల్లు తాగిన వారికి రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రభుత్వం గీత కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందరిని భయపెడుతున్న కరోనాకు తాటి, ఈత కల్లు మంచి ఔషధమన్నారు. ఈత చెట్టు నుంచి తీసిన కల్లును శ్రీనివాస్ గౌడ్ రుచి చూశారు.

ఇదీ చదవండి:KTR:'క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి'

Last Updated : Jun 10, 2021, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details