తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2021, 10:07 PM IST

ETV Bharat / state

'లాక్​డౌన్​ను త్వరగా ముగించాలంటే అదొక్కటే మార్గం'

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను త్వరగా ముగించుకోవాలంటే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టును డీజీపీ ఆకస్మిక తనిఖీ చేశారు.

Telangana news
హైదరాబాద్​ వార్తలు

ప్రజలందరూ లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించాలని డీజీపీ మహేందర్​ రెడ్డి సూచించారు. వైరస్‌ చెయిన్‌ బ్రేక్‌ చేయడానికే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని పేర్కొన్నారు. అత్యవసర పనులకు వెళ్లే వారంతా సజావుగా వెళ్లేలా చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. కూకట్​పల్లి జేఎన్​టీయూ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్​పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అన్ని కమిషనరేట్ల పరిధుల్లో పోలీసు అధికారులు లాక్‌డౌన్ విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీజీపీ చేరుకునే సమయంలో సైబరాబాద్ సీసీ సజ్జనార్ వాహనాల తనిఖీల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బ్లాక్​లో బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్లు.. ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details