రాష్ట్రంలోని పలు అంశాలపై విచారణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా అన్నారు. ఈ కమిటీలు రెండు నెలల్లో అధ్యయనం చేసి ఇచ్చే నివేదికలను గవర్నర్‌కు సమర్పిస్తామని కుంతియా వెల్లడించారు. అవినీతిని సహించమని చెప్తున్న కేంద్రానికి నివేదికలు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరుతామని స్పష్టం చేశారు.
కీలక సమస్యలపై కాంగ్రెస్ కమిటీలు: కుంతియా - రాష్ట్రంలోని పలు అంశాలపై విచారణ కమిటీలు
తెలంగాణలో యురేనియం తవ్వకం, ప్రాజెక్టుల అంచనాల పెంపు అవినీతిపై పలు కమిటీలు వేశామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా తెలిపారు.
కమిటీల నివేదికలు వచ్చాకే కార్యచరణ ప్రకటిస్తాం : కుంతియా
యురేనియం తవ్వకంపై హన్మంతరావు అధ్యక్షతన కమిటీ వేశామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అంచనాల పెంపు అవినీతిపై మరో కమిటీ వేశామని చెప్పారు. ఈ కమిటికీ ఛైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కన్వీనర్‌గా భట్టి విక్రమార్క వ్యవహరిస్తారని వివరించారు. యాదాద్రి శిలలపై కేసీఆర్, కారు బొమ్మ చెక్కడం అప్రజాస్వామికమన్నారు.
ఇవీ చూడండి : 'కాంగ్రెస్ పాలనలోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది'
Last Updated : Sep 8, 2019, 7:34 PM IST