తెలంగాణ

telangana

ETV Bharat / state

MP RANJITH REDDY: రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించండి: ఎంపీ - తెలంగాణ 2021 వార్తలు

నవాంద్గి రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని చేవెళ్ల లోక్​సభ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ విషయంలో రైల్వే శాఖ విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

chevella-mp-ranjith-reddy-demands-construction-of-railway-underbridge-at-nawandgi-railway-station
రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించండి: ఎంపీ

By

Published : Aug 3, 2021, 9:42 AM IST

రంగారెడ్డి జిల్లా నవాంద్గి రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఆయన సోమవారం లోక్‌సభలో ప్రస్తావించారు. నవాంద్గి స్టేషన్‌ మీదుగా వరస రైళ్ల రాకపోకల కారణంగా గేటు వేయడంతో మండల కేంద్రం బషీరాబాద్‌కు వెళ్లే 36 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇతర మార్గం లేక పోవడంతో రైళ్లు వెళ్లే వరకు గేటు వద్ద వేచి ఉండక తప్పడం లేదని తెలిపారు. స్టేషన్‌ వద్ద ఉన్న రైలు గేటును తొలగించి అండర్‌ బ్రిడ్జిని నిర్మించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో రైల్వే శాఖ విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:Huzurabad By Elections: కాంగ్రెస్​కు ఉపఎన్నిక గండం.. ఈసారి రేవంత్​ హస్తవాసి పనిచేసేనా?

ABOUT THE AUTHOR

...view details