గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కానీ సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ పథకాలతో పేదలకు ఆందోళన తప్పిందని వెల్లడించారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా నిలిచారని కొనియాడారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్, జి.దిలావర్పూర్ మండలాలకు చెందిన 105మందికి రూ.లక్షా 116 చొప్పున కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
'ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్' - kalyana lakshmi cheques distribution in nirmal district
నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్, జి.దిలావర్పూర్ మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు, మొత్తం 105మందికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెక్కులు అందించారు.
నిర్మల్లో చెక్కుల పంపిణీ
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని మంత్రి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొన్నారు.