హైదరాబాద్కు మకాం మార్పు
ప్రభుత్వాధికారినంటూ అడ్డగోలుగా దోచేశాడు, బుక్కయ్యాడు - POLICE
ప్రభుత్వ అధికారిగా చెలామణి అవుతూ... నిరుద్యోగుల నుంచి వేల రూపాయలు కాజేస్తున్నాడో యువకుడు. తన మిత్రులంతా ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించి ఆనందమైన జీవితం గడుపుతున్నారని తాను కూడా వారిలా కొనసాగాలనే దుర్బుద్ధితో మోసాలకు పాల్పడి చివరకు కటకటాల పాలయ్యాడు.
ప్రభుత్వాధికారినంటూ దోచేస్తున్నాడు
హైదరాబాద్లో అయితే బాగా మోసం చేయవచ్చని కుర్షిద్ నగరానికి చేరుకున్నాడు. సిద్దార్ధ్ అనే వ్యక్తిని నమ్మించి 40వేలు దోచేశాడు. తనకు ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కుర్షిద్ను అరెస్టు చేశారు. ఇతని వద్ద 40వేల రూపాయలు, కొరియా డాలర్లు, ఒక సెల్‌ఫోన్, నకిలీ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నామని సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ తెలిపారు.
ఇవీ చదవండి:తెరాసతో కుమ్మక్కైనకాంగ్రెస్ నేతలు