తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2019, 1:37 PM IST

ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్, కేంద్ర సహాయ మంత్రి​

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు వచ్చారు. శ్రీవారి సేవలో తరించేందుకు గవర్నర్​ నరసింహన్​ దంపతులు విచ్చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదా చేపట్టాక తొలిసారిగా కిషన్​రెడ్డి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమలలో ప్రముఖుల సందర్శనలు

తిరుమల శ్రీవారిని గవర్నర్​ నరసింహన్​ దంపతులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

స్వామివారి సేవకై వచ్చిన గవర్నర్​

తిరుమల శ్రీవారిని గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన సర్కారీ సహస్ర కళశాభిషేకం సేవలో గవర్నర్‌ దంపతలు పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమలలో ప్రముఖుల సందర్శనలు

సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టాక...

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. హోంశాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టిన ఆయన శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం ఆక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. గతంలో తిరుమల అడవుల్లో పర్యటించి ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్న పరిస్థితులను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. స్వామివారి కృపతో తనకు హోదా వచ్చిందని... కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కృషిచేస్తానని కిషన్​ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:వరుస దొంగతనాలకు హడలుతున్న నిజామాబాద్​వాసులు

ABOUT THE AUTHOR

...view details