హైదరాబాద్లోనే కాదు.. లండన్లోనూ బోనాల సందడి మొదలైంది. తెలంగాణ ఎన్నారైఫోరం ఆధ్వర్యంలో క్రాంఫర్డ్ కళాశాల ఆవరణలో వేడుకలను ఆదివారం నిర్వహించారు. బ్రిటన్ నలుమూలల నుంచి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేడుకలో లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, భారత రాయబార కార్యాలయం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎనిమిదేళ్లుగా ఏటా ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలంగాణ ఎన్నారై ఫోరం ఛైర్మన్ గంప వేణుగోపాల్ అన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాలు నిర్వహించడం... హిందూ సంప్రదాయాల్లో భాగస్వామ్యం అవ్వడం సంతోషకరమని లండన్ ఎంపీ సీమా మల్హోత్రా ఆనందం వ్యక్తం చేశారు.
లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు