తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ గెలుపు కోరుతూ ప్రచారం - Yuva Telangana Party MLC candidate Rani Rudrama Reddy campaigning for victory

ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ రెడ్డి గెలుపును కోరుతూ సూర్యాపేట జిల్లా పలు మండలాల్లో నాయకులు ప్రచారం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందిని కలిశారు. తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్​ సోమారం శంకర్ పాల్గొన్నారు.

Yuva Telangana party leaders campaign in Suryapeta district seeking Rani Rudrama victory
ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ గెలుపు కోరుతూ ప్రచారం

By

Published : Jan 6, 2021, 7:41 PM IST

యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ రెడ్డి గెలుపును కోరుతూ సూర్యాపేట జిల్లా నాగారం, జాజిరెడ్డి గూడెం మండలాల్లో నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆమె గెలుపును కోరుతూ తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సిబ్బందిని కలిశారు.

గెలుపుకోసం..

మండల పరిషత్ కార్యాలయంలోని సిబ్బందిని కలిసి రాణీ రుద్రమ రెడ్డి గెలుపుకు సహకరించాలని కోరారు. స్థానిక నాయకులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ సోమారం శంకర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సైదులు, జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఒక్క రూపాయి లంచం ఇచ్చినట్లు నిరూపిస్తే... 10 వేల రివార్డు'

ABOUT THE AUTHOR

...view details