సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. నూతనకల్ సహకార పరపతి సంఘానికి గురువారం 442 బస్తాలు యూరియా వచ్చింది. ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించుకుని పంపిణీ మొదలు పెట్టారు. 200 బస్తాలు అందించిన తర్వాత అనూహ్యంగా సుమారు 300 మంది అన్నదాతలు యూరియా కోసం వచ్చారు. నిలువ 150 బస్తాలు మాత్రమే ఉండడం వల్ల యూరియా బస్తాలకోసం రైతుల మధ్య తోపులాట జరిగింది.
రైతులకు తప్పని యూరియా తిప్పలు - yuria problems at nuthankall in suryapeta
ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నా.. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నదాతలు గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడినా యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది.
![రైతులకు తప్పని యూరియా తిప్పలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4562790-thumbnail-3x2-kon.jpg)
రైతులు
Last Updated : Sep 26, 2019, 8:27 PM IST