Sharmila deeksha in rain: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన దీక్షను విరమించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టగా తెరాస నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారితో పాటు పోటాపోటీగా వైతెపా కార్యకర్తల నినాదాలు చేశారు. దీంతో తెరాస, వైతెపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
ఇవాళ ఉదయం నుంచే తెరాస కార్యకర్తలు సోమన్నపై రెక్కీ నిర్వహించారు. పోలీసులకు చెప్పినా వాళ్లేం చేయలేకపోయారు. తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకోవాలని ఉదయం నుంచి చెప్పినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సోమన్నపై దాడి చేసిన వారిని తాము గుర్తించి చెప్పినప్పటికీ చూసీచూడనట్లు వదిలేశారు. దాడి చేసిన వారిని మఠంపల్లి ఎస్సై రవి దగ్గర ఉండి మరీ ఇక్కడి నుంచి పంపించేశారు. ఈ దాడికి సూత్రదారి మఠంపల్లి మండల తెరాస అధ్యక్షుడు. అతన్ని ఇంతవరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు. దాడి చేసిన వారిని అరెస్టు చేసేంత వరకు ఈ గ్రామం నుంచి కదలను. పోలీసులు తెరాస నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. గులాబీ కండువా కప్పుకోండి’’
- వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు