సూర్యాపేట జిల్లా మోతె మండలం రావికుంట తండా సమీపంలోని పాలేరు వాగులో చేపల వేటకు వెళ్లి ఖమ్మం జిల్లా తిరమలయపాలెం మండలం మంగలితండ గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు మృతి చెందాడు. సంతోష్ తన స్నేహితులతో పాటు పాలేరు వాగులోకి దిగి చేపలు పడుతుండగా నీటి ప్రవాహం ఎక్కువకావడం వల్ల సంతోష్ నీటిలో కొట్టుకుపోయాడు.
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి - young man death
చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయిన ఘటన సూర్యాపేట జిల్లా రావికుంట తండా సమీపంలో జరిగింది. ఆ యువకుడు స్నేహితులతో కలిసి చేపలు పడుతుండగా పాలేరు వాగులో వరద ప్రవాహం పెరిగి అందులో కొట్టుకుపోయాడు.
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి
తోటి స్నేహితులు సంతోష్‌ను కాపాడే ప్రయత్నాలు చేసినపట్టికీ ప్రాణాలు దక్కలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: పెళ్లైన మూడు నెలలకే యువకుడి ఆత్మహత్య