తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం దుకాణం ముందు మహిళల ఆందోళన - latest news on wine shop in chilukuru

జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని శివారు ప్రాంతానికి తరలించాలంటూ సూర్యాపేట జిల్లాలో మహిళలు ఆందోళనకు దిగారు.

మద్యం దుకాణం ముందు మహిళల ఆందోళన

By

Published : Nov 22, 2019, 10:01 AM IST

జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గత రాత్రి మహిళలు ఆందోళనకు దిగారు. దుకాణాన్ని శివారు ప్రాంతానికి తరలించాలంటూ ధర్నా చేశారు.

పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ మార్గం ద్వారానే పోతుండడం వల్ల మందు బాబులతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు ఆరోపించారు. తాగిన మైకంలో మాలమూత్రలు ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తూ చుట్టుపక్కల ఉన్నవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మద్యం దుకాణం ముందు మహిళల ఆందోళన

ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం

ABOUT THE AUTHOR

...view details