సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు రెండు వందల మంది మహిళలు వచ్చారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారంతా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయం 6 గంటలకు రావాల్సిన డాక్టర్లు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి 60 మందికి మాత్రమే ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఉదయం నుంచి ఏమీ తినకుండా పడిగాపులు కాస్తున్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలకు పడకలు సరిపోక నేలమీదనే పడుకోబెట్టారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు.
ఆ'పరేషాన్'... తుంగతుర్తిలో మహిళల పాట్లు - women facing problems as there are no surgeons
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళలు అవస్థలు పడ్డారు. కుటుంబ నియంత్రణ కోసం రమ్మని చెప్పి... నిర్లక్ష్యం చేయడంతో అవస్థలు పడ్డారు.

ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం వల్ల మహిళల అవస్థలు
ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం వల్ల మహిళల అవస్థలు
ఇదీ చదవండిః కుటుంబ నియంత్రణకు వచ్చిన మహిళల అవస్థలు
TAGGED:
family planning operation