సూర్యాపేట పట్టణం అంజనాపురి కాలనీలో విషాదం చోటుచేసుకొంది. పాపట్ల పద్మ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సద్దుల చెరువులో శవమై తేలింది.
సూర్యాపేట పట్టణానికి చెందిన పాపట్ల యుగందర్ రెడ్డి, పద్మ దంపతులు స్థానిక అంజనాపూరి కాలనీలో నివాసముంటున్నారు. మద్యానికి బానిసయిన యుగందర్.. పద్మను నిత్యం వేధించినట్లు స్థానికులు తెలిపారు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని.. భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఆత్యహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. అల్లుడే కొట్టి చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసుకున్నారు.