సూర్యాపేట జిల్లా మునగాలలోని ఎన్ఎస్పీ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. మృతురాలు ఆత్మహత్య చేసుకుందా లేక అనుకోకుండా కాలువలో పడిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఎన్ఎస్పీ కాలువలో పడి మహిళ మృతి - ఎన్ఎస్పీ కాలువలో పడి మహిళ మృతి
నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. మృతురాలు ఆత్మహత్య చేసుకుందా లేక అనుకోకుండా పడింద అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
![ఎన్ఎస్పీ కాలువలో పడి మహిళ మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4446198-thumbnail-3x2-lad.jpg)
ఎన్ఎస్పీ కాలువ
ఎన్ఎస్పీ కాలువ