ఈటీవీ తెలంగాణ- ఈటీవీ భారత్‌లో 'విద్యుత్ గాయం- తీరని శాపం'పేరిట ప్రసారమైన కథనానికి స్పందన లభించింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన బాలుడు విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో ఎడమ చేయిని కోల్పోయాడు. కుమారుడి వైద్యం కోసం ఆ కుటుంబం అనేక ఇబ్బందులు పడుతోంది. వారి పరిస్థితిని కథనంలో వివరించడంపై.. పలువురు దాతలు స్పందించారు. బాలుడిని ఆదుకునేందుకు తమవంతుగా సాయం అందించారు.
ఈటీవీభారత్ కథనానికి స్పందన.. దాతల ఆపన్నహస్తం - telangana news
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన బాలుడు దీనస్థితిపై ఈటీవీ-ఈటీవీ భారత్ కథనానికి స్పందన వచ్చింది. బాలుడిను ఆదుకునేందుకు పలువురు ముందుకు వచ్చారు.
ఈటీవీభారత్ కథనానికి స్పందన.. దాతల ఆపన్నహస్తం
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రతాప్.. రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. సింగరేణి డైరెక్టర్ వీరారెడ్డి రూ.25 వేలు, సికింద్రాబాద్‌కు చెందిన నాగేశ్వరరావు, శశిధర్‌రెడ్డి.. పదివేల రూపాయల సాయం చేశారు. బాలుడి వైద్యం కోసం మరో 3 లక్షలు అవసరం ఉన్నాయన్న కుటుంబసభ్యులు.. మరికొంత మంది దాతలు చేయూత నివ్వాలని కోరుతున్నారు.
ఇవీచూడండి:దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న పసివాడు