తెలంగాణ

telangana

ETV Bharat / state

భర్త ఇంటి ముందు భార్య ధర్నా - crime news

ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు.. అవసరాలు తీర్చుకున్నాడు.. అనారోగ్యంతో ఉన్నావు వద్దు పో అని ఇంటి నుండి వెళ్లగొట్టాడు. న్యాయం చేయాలని ఆ యువతి అత్తగారి ఇంటి ముందు ఆందోళన చేపట్టిన ఘటన సూర్యాపేట జిల్లా పొనుగోడులో జరిగింది.

wife protest in front of husband's house in suryapet district
భర్త ఇంటి ముందు భార్య ధర్నా

By

Published : May 31, 2020, 8:35 PM IST

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల పాటు కలిసి కాపురం చేసిన భర్త ఇప్పుడు భార్యను వదిలించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు అని చెప్పి భార్యను వద్దంటున్నాడు. దీంతో ఆ ఇల్లాలు భర్త కావాలి అంటూ అత్తగారి ఇంటి ముందు ధర్నా చేపట్టింది.

ప్రేమించానని నమ్మించి మూడు నెలలపాటు కాపురం చేసి.. ఇప్పుడు తనకు వద్దంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని అత్తగారి ఇంటి ముందు యువతి బైఠాయించింది. తనకు తన భర్త కావాలని, ఆయనతో జీవితకాలం కలిసి ఉంటానని.. తనకు న్యాయం చేయాలని ఆ యువతి కోరుతోంది.

ఇవీ చూడండి: మితిమీరిన వేగం.. జీవితాలు ఆగం

ABOUT THE AUTHOR

...view details