తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య - WIFE NAGALAKSHMI

తమ స్వేచ్ఛకు అడ్డొస్తున్నాడని తాళి కట్టిన భర్తను ప్రియుడితో కలిసి అడ్డు తొలగించుకుందో భార్య.

సైదులు అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న నాగలక్ష్మి

By

Published : Mar 20, 2019, 11:07 PM IST

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య
తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. పోలీసులు చెప్పిన సమాచారం మేరకుసూర్యాపేటకు చెందిన కాశయ్య అనే దివ్యాంగుడు భార్య నాగలక్ష్మితో కలసి ఎల్బీనగర్ -ఎస్​బీహెచ్ కాలనీలో జీవనం సాగిస్తున్నారు. సైదులు అనే యువకుడితో నాగలక్ష్మి వివాహేతరసంబంధం పెట్టుకుంది. ఇదే విషయమై కాశయ్య పలుమార్లు ఆమెను మందలించాడు.

తమ స్వేచ్ఛకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య, ప్రియుడు సైదులుతో కలిసి భర్త గొంతునులిమి హత్య చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నేరం చేసినట్లు నిందితులు ఒప్పుకోవటంతో అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details