సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక భార్య... భర్త తలపై కర్రతో కొట్టి చంపింది. కందుల బక్కిరెడ్డి(45) రోజు మద్యం తాగి భార్యను వేధించేవాడు. భార్య ఎన్నిసార్లు మందలించిన వినిపించుకోలేదు. శనివారం రాత్రి భార్యపై చేయి చేసుకోగా... సైదమ్మ క్షణికావేశంలో భర్త తలపై కర్రతో గట్టిగా కొట్టింది. తల పగిలి రక్తస్రావమైంది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించాడు. భార్య సైదమ్మకు మతిస్థిమితం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్రతో కొట్టి భర్తను చంపిన భార్య - wife killed her husband
క్షణికావేశంలో కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. తనపై చేయి చేసుకున్నాడనే ఆవేశంలో కర్రతో కొట్టి చంపింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
కర్రతో కొట్టి భర్తను చంపిన భార్య