హుజూర్నగర్ ఉప ఎన్నికలో బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా తనను ప్రకటించి భాజపా గుర్తింపు పొందిందని ఆ పార్టీ అభ్యర్థి కోట రామారావు అన్నారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు అగ్ర కులాలకే పెద్ద పీట వేశాయని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలను చేపలు, గొర్రెలు పెంచుకోవడానికి తప్ప పాలనకు పనికి రాని వారిగా చిత్రీకరించారన్నారు. మాకు అధికారంలో చోటివ్వని తెరాస ప్రభుత్వం నేర చరిత్ర గల వ్యక్తి సైదిరెడ్డిని బరిలో నిలిపిందని మండిపడ్డారు. అమరవీరుడి తల్లి శంకరమ్మకు ఈ పార్టీలు ఎందుకు సీటు ఇవ్వలేదని ప్రశ్నించారు. హిందూ గాళ్లు, బొందు గాళ్లు అన్న కేసీఆర్కు ఇక్కడి హిందువులు గట్టి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
'హిందూగాళ్లు..బొందుగాళ్లు అన్నవారికి బుద్ధి చెప్పాలి'
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, తెరాసలు అగ్ర వర్ణాల అభ్యర్థికే పెద్ద పీట వేశాయని భాజపా అభ్యర్థి కోట రామారావు అన్నారు. బడుగులను పాలనకు దూరం పెట్టాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, తెరాస బడుగులను పాలనకు దూరం పెట్టాయి : కోట రామారావు
TAGGED:
హుజూర్నగర్ ఉప ఎన్నిక