భాజపా ప్రభుత్వం కార్పొరేట్లకు తొత్తుగా మారి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తాం : చాడ
కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో నిరసనలు చేపడుతామన్నారు. రైతుల విషయంలో కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన కోరారు.
రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తాం : చాడ
రైతులకు మద్దతు తెలిపే విషయంలో సీఎం కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు తమ పోరాట కొనసాగుతుందని వెల్లడించారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చట్టాల రద్దుపై మోదీకి విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని చాడ వెంకటరెడ్డి అన్నారు.