అపద్బందు స్వచ్ఛందసేవ సంస్థ ఓ పేద కుటుంబానికి ఆసరాగా నిలిచింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన వేల్పుల గంగయ్య ఇటీవల మరణించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి అండగా నిలిచారు. గ్రామానికి చెందిన యువభారత్, స్వచ్ఛందసేవ సంస్థ సంయుక్తంగా అర క్వింటా బియ్యం, నిత్యావసరాలు, సామాజిక మాధ్యమం ద్వారా సేకరించిన రూ.10,100 అందించి ఆదుకున్నారు.
పేద కుటుంబానికి స్వచ్ఛందసేవ సంస్థ సాయం - తెలంగాణ వార్తలు
కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబానికి సాయం అందించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామంలో అపద్బంధు స్వచ్ఛందసేవ సంస్థ తరపున నిత్యావసరాలు అందజేశారు.
పేద కుటుంబానికి స్వచ్ఛందసేవ సంస్థ సాయం
ఉప్పుల మహేష్ (తెలుగు పంతులు) గారి సౌజన్యంతో అపద్బంధు స్వచ్ఛంద సేవ సంస్థ ముందుకు వచ్చి సాయమందించింది. పేద కుటుంబాన్ని ఆదుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల లింగయ్య, వేల్పుల సుధాకర్, బొలక సైదులు, బొలక సందీప్, బోర వెంకన్న, బొమ్మగాని సుధాకర్, చామకూరి రమేష్, బోర వెంకన్న, ఏనుగంటి తిరుపతి, మంద నాగేష్, తదితరులు పాల్గొన్నారు.