తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లెప్రగతి సదస్సును బహిష్కరించిన గ్రామస్థులు

సూర్యాపేట జిల్లా మాచినపల్లి గ్రామంలో గ్రామస్థులు మూడో విడత పల్లెప్రగతి అవగాహన సదస్సును బహిష్కరించారు. గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోని అధికారులు.. ఇప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్ననాడే పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టాలని గ్రామస్థులు అన్నారు.

Villagers who boycotted the Pallapragati Awareness Conference in suryapet district
పల్లెప్రగతి అవగాహన సదస్సును బహిష్కరించిన గ్రామస్థులు

By

Published : May 31, 2020, 5:07 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు , యువజన సంఘాలు, రైతులు మూడో విడత పల్లెప్రగతి అవగాహన సదస్సును బహిష్కరించారు. గత కొంత కాలంగా గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకోని సర్పంచ్, అధికారులు ఇప్పుడు పల్లె ప్రగతిని చేద్దామని ఎందుకొచ్చారని గ్రామస్థులు ప్రశ్నించారు.
ఇసుక అక్రమ రవాణా వల్ల గ్రామంలో తాగు, సాగునీటికి ఇబ్బంది కలిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే దీనిని అరికట్టాలని అధికారులను కోరారు. గ్రామం నుంచి పూర్తిగా ఇసుకను తరలించకుండా ఆపిననాడే పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టాలని, అప్పటివరకు ఇలాంటి కార్యక్రమాలకు గ్రామం దూరంగా ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details