సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాలకు చెందిన గడ్డం రాములు... మరో వ్యక్తితో కలిసి 3 రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మునగాల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ నిమిత్తం ఇద్దరినీ ఠాణాకు తీసుకెళ్లారు. రేపాలకు చెందిన ఓ వ్యక్తి హామీ మేరకు పోలీసులు నిందితులను ఇంటికి పంపించేశారు. గ్రామస్థుల సమక్షంలో దొంగతనం చేసినట్లు ఇద్దరు అంగీకరించారు. తప్పుకు పరిహారంగా గ్రామ పెద్దలు రూ.30 వేల జరిమానా విధించారు. ఈ తతంగమంతా... అవమానంగా భావించిన రాములు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రాములు మృతి చెందాడు. పోలీసులు, గ్రామపెద్దలే రాములుని చంపారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. హామీ ఇచ్చి జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో నిరసనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈక్రమంలో పోలీసులకు కుటుంబ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది.
పోలీసులు, గ్రామపెద్దలే చంపారంటూ మృతదేహంతో ధర్నా
దొంగతనం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి హామీ మేరకు విడుదల చేశారు. నిందితులకు గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి జరిమానా విధించారు. ఇదంతా అవమానంగా భావించి ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ఓ ఎత్తైతే... అతని మరణానికి పోలీసులు, గ్రామపెద్దలే కారణమని... మృతదేహంతో సహా బంధువులు ఆందోళనకు దిగారు.
VILLAGERS PROTEST WITH DEAD BODY