సూర్యాపేట జిల్లా నడిగూడెంలో స్థానికులు వినూత్నరీతిని నిరసన తెలిపారు. మండల కేంద్రం నుంచి నాయకన్‌గూడెంకు వెళ్లే రహదారిపై అడుగడుగునా గుంతలు ఉండటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గుంతల్లో కూర్చొని నిరసన - roads damage news
రోడ్డు మరమ్మతులు చేయాలని సూర్యాపేట జిల్లా నడిగూడెంలో నాయకన్‌గూడెం వాసులు నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా... పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆరోపించారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
villagers protest for roads repairs in nadigudem
నడిగూడెం వద్ద రోడ్డుపై గుంతలో ఉన్న నీటిలో కూర్చొని ఆందోళన చేశారు. అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా... చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.