కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తోన్న ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. సూర్యాపేటలో కోవిడ్ -19 తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించింది.
కరోనా ఎఫెక్ట్: సూర్యాపేటకు ప్రత్యేకాధికారి నియామకం - సూర్యాపేటకు ప్రత్యేకాధికారి నియమకం
తెలంగాణలో హైదరాబాద్ తరువాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల జాబితాలో సూర్యాపేట కూడా చేరింది. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
![కరోనా ఎఫెక్ట్: సూర్యాపేటకు ప్రత్యేకాధికారి నియామకం Venugopal Reddy appointed a special officer Due to high prevalence of corona virus in SURYAPET](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6882650-701-6882650-1587467251532.jpg)
కరోనా ఎఫెక్ట్: సూర్యాపేటకు ప్రత్యేకాధికారి నియమకం
పురపాలకశాఖలో ఉపసంచాలకులుగా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డిని సూర్యాపేటలో కరోనా నివారణ చర్యలకు ప్రత్యేకాధికారిగా నియమించారు. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో వేణుగోపాల్ రెడ్డి హుటాహుటిన సూర్యాపేట బయల్దేరి వెళ్లారు. ఆయన గతంలో ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు.