తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్ట్‌ను కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అధికారులు మూసివేశారు. దీనితో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
రామాపురం చెక్‌పోస్ట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు - రెండో రోజు లాక్డౌన్
రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని చెక్‌పోస్టులను సర్కారు మూసేసింది. దీనితో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కోదాడ రామాపురం చెక్‌పోస్టు వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
రామాపురం చెక్‌పోస్ట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు
తాము గంటల కొద్ది ఇక్కడ పడిగాపులు కాస్తున్నా అనుమతి ఇవ్వడం లేదని వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి వాహనాలు అనుమతించేది లేదని పోలీసులు వారితో తేల్చిచెప్పారు. ఈ ఒక్క రోజుకు అనుమతివ్వండి అంటూ ప్రయాణికులు అధికారులను కోరారు.
ఇదీ చూడండి:ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...