సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆర్టీవో అధికారు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఐదు స్కూల్ బస్సులు, ఒక ఆటో ఉన్నాయి.
హుజూర్‌నగర్‌లో ఆర్టీవో అధికారుల ఆకస్మిక తనిఖీలు - సూర్యాపేట జిల్లా తాజా వార్త
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆర్టీవో అధికారులు వాహనాలపై మెరుపు దాడులు చేపట్టారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను, పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణిస్తున్న స్కూల్ బస్సులు, ఆటోను సీజ్ చేశారు.
హుజూర్‌నగర్‌లో ఆర్టీవో అధికారుల ఆకస్మిక తనిఖీలు
18 సంవత్సరాలు నిండని వారు కూడా స్కూలు బస్సులను నడుపుతున్నట్లు సమాచారం రావడం వల్ల దాడులు నిర్వహించినట్లు కోదాడ ఆర్టీవో తెలిపారు. సీనియర్ డ్రైవర్లు కూడా ఎప్పటికప్పుడు బస్సుల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌లను అందుబాటులో ఉంచుకోవాలని డ్రైవర్లకు సూచించారు. డ్రైవింగ్ లైసెన్సులను రెన్యువల్ చేయించుకోవాలని అన్నారు. తాము ఏ సమయంలోనైనా స్కూల్ బస్సుల మీద దాడులు నిర్వహిస్తామని ఆయన ఆర్టీవో హెచ్చరించారు.
ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి