తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో మొక్కలు నాటిన వనజీవి రామయ్య - suryapet

చెట్ల పెంపకాన్ని ప్రాణప్రతిష్ఠగా భావించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు.

కరెన్సీ నోట్లపై మొక్క నాటుతున్న గాంధీజీ చిత్రం ప్రచురించాలి

By

Published : Mar 25, 2019, 12:13 AM IST

కరెన్సీ నోట్లపై మొక్క నాటుతున్న గాంధీజీ చిత్రం ప్రచురించాలి
సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రిలో హోప్​ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో వనజీవి రామయ్య సతీ సమేతంగా మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని ప్రాణ ప్రతిష్ఠగా భావించాలన్నారు.

కరెన్సీ నోట్లపై మొక్క నాటుతున్న గాంధీజీ చిత్రం ప్రచురించాలి

కరెన్సీ నోట్లపై మొక్కలు నాటుతున్న మహనీయుల చిత్రాలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి చిత్రాలను చూస్తే పిల్లలు స్ఫూర్తి గా తీసుకుని మొక్కలు నాటుతారని వివరించారు.

ప్రతి కార్యక్రమానికి ముందు నిర్వహించే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి బదులుగా ఒక మొక్కను నాటాలని సూచించారు. చెట్లకు మనిషికి మధ్య అమ్మఒడిలాంటి అనుబంధముందని అభివర్ణించారు.


ఇదీ చదవండి:రేపే లోక్​సభ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details