సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో వడగళ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది. నాగారం మండలం జొన్నలగడ్డ తండాలో జాటోతు రాయుడు అనే రైతుకు చెందిన రెండు వ్యవసాయ ఎద్దులు శుక్రవారం రాత్రి పడిన పిడుగుపాటుతో మృతి చెందాయి. మామిడి పల్లి గ్రామంలో ఈదురు గాలులకు అంబటి శ్రీనివాస్ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. రాత్రి వేళ ఈదురు గాలులు రావడం వల్ల పక్క ఇంట్లో తల దాచుకున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితులకు సహయపడాలని స్థానికులు కోరుతున్నారు.
పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి - vadagalla-vana
సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. జొన్నలగడ్డ తండాలో పిడుగుపాటు రెండు ఎద్దులు చనిపోగా.. ఈదురుగాలులకు మామిడిపల్లిలో ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి.
పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి