తెలంగాణ

telangana

ETV Bharat / state

మా నిధులు మాకే ఖర్చు చేయాలి: ఉత్తమ్ - uttam-press-meet in Hujurnagar

సిమెంట్ పరిశ్రమల వల్ల నష్టపోయే హుజూర్​నగర్ నియోజకవర్గానికి మైనింగ్ సెస్ నిధులను ఖర్చు చేయకుండా మంత్రి జగదీశ్ రెడ్డి.. సూర్యాపేట జిల్లాకు ఖర్చు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాంత వాసుల కోసం ఖర్చు చెయ్యకపోతే బందుకు పిలుపునిస్తామని, హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

మా నిధులు మాకే ఖర్చు చేయాలి: ఉత్తమ్

By

Published : Aug 28, 2019, 11:58 PM IST

మంత్రి జగదీశ్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూర్​నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల నుంచి వచ్చే మైనింగ్ నిధులను.. ప్రభావితం చేసే ప్రాంతాల్లో ఖర్చు చేయకుండా సూర్యాపేట జిల్లా కేంద్రానికి నిధులను మంత్రి జగదీశ్​ రెడ్డి ఖర్చు చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి చెందిన తెరాస నాయకులు ఈ నియోజకవర్గానికి చెందిన మైనింగ్ సెస్ నిధులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా నోరు మెదపడం లేదని విమర్శించారు. ఈ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న తనకు కూడా ఆ నిధులకు సంబంధించిన వివరాలు ఏమీ తెలపడం లేదని వెల్లడించారు. మైనింగ్ వల్ల నష్టపోయే వారికి ఆయా ప్రాంతాల్లోని మైనింగ్ నిధులను ఖర్చు చేయాలని కేంద్రం నుంచి జీవో ఉన్నప్పటికి మంత్రి అమలు చేయటం లేదని విమర్శించారు.

మా నిధులు మాకే ఖర్చు చేయాలి: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details