హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి పాలకవీడు మండలంలో ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో పర్యటించి హస్తం గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు. లిఫ్ట్ ద్వారా నీరు అందించే ప్రయత్నం కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ తీసుకుంటే, తెరాస అభ్యర్థి మాత్రం గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
హుజూర్నగర్ ప్రచారంలో ఉత్తమ్ పద్మావతి దూకుడు - కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి పాలకవీడు మండలంలో ప్రచారం
హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి దూకుడు పెంచారు. గడిచిన ఆరేళ్లలో తెరాస ప్రభుత్వం హుజూర్ నగర్లో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
హుజూర్నగర్ ప్రచారంలో ఉత్తమ్ పద్మావతి దూకుడు