హుజూర్‌నగర్‌లో జరిగే ఉపఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పే ఎన్నికవుతుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెరాస నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజూర్నగర్ టికెట్ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామారానికి చెందిన ఆంధ్ర వ్యక్తికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేయిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రస్థాయిలో జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాటం చేస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
ఆంధ్ర వ్యక్తికి హుజూర్నగర్ టికెటెలా ఇచ్చారు?: ఉత్తమ్ - ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రెస్ మీట్
కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. తండ్రి ఇచ్చిన పదవులతో విర్రవీగొద్దని హితవు పలికారు. తమలాగ కుటుంబ, కుల రాజకీయాలు చేయట్లేదంటూ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రెస్ మీట్