ఒక్క మహిళపై... 700 మంది తీస్మార్ఖాన్లు తెరాస అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి వస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించారు. తాను 6 సార్లు వరుసగా గెలిచానని.. సుమారు హుజూర్నగర్ నియోజకవర్గంలో రూ. 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని స్పష్టం చేశారు. జాన్పాడు-మిర్యాలగూడ రైల్వేలైన్ మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.300 కోట్లతో గ్రామాలలో రోడ్లు బాగుచేసినట్లు పేర్కొన్నారు.
'ఒక్క మహిళపై.. 700 మంది తీస్మార్ఖాన్లా?' - హుజూర్నగర్ వార్తలు
"ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు.. రాజకీయంగా పుట్టకముందే కృష్ణానది నుంచి హుజూర్నగర్ పట్టణానికి, కృష్ణపట్నం గ్రామానికి మంచినీరు తీసుకొచ్చా." - ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
!['ఒక్క మహిళపై.. 700 మంది తీస్మార్ఖాన్లా?'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4592624-thumbnail-3x2-df.jpg)
ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రచారం
ఇదీ చదవండీ... సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి... దసరా ఉత్సవాలు ప్రారంభం