సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 14 వార్డులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన ఉన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బస్తీమే సవాల్: ఓటు హక్కు వినియోగించుకున్న ఉత్తమ్ దంపతులు - ఓటు హక్కును వినియోగించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కోదాడలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న ఉత్తమ్ దంపతులు
తెరాస పార్టీ డబ్బులు, మద్యాన్ని అధికంగా పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతునట్లు ఆరోపించారు. పోలింగ్ అయిపోయేంత వరకు పోలింగ్ సరళిని గమనించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్తమ్ సూచించారు.
ఇవీ చూడండి: ఓటర్లకు పంపిణీకి తీసుకొస్తున్న చీరల పట్టివేత